schedule Wednesday, September 02, 2026

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫైల్ కేంద్రం నుంచి రిటర్న్

calendar_today August 11, 2026
person Prajagalam News
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫైల్ కేంద్రం నుంచి రిటర్న్
⇒కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ⇒మాజీ ఎమ్మెల్యే  డాక్టర్ మెతుకు ఆనంద్   వికారాబాద్ జిల్లా:- పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలా? వద్దా? అనే అంశం తమ పరిశీలనలో లేదంటూ కేంద్రం ఫైల్‌ను తిప్పి పంపడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విమర్శించారు. తెలంగాణకు అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై బలమైన ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందనిఆయన ఆరోపించారు.ఇతర రాష్ట్రాల్లోని పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం, ప్రాధాన్యత లభిస్తున్నప్పుడు, తెలంగాణ జీవనాడిగా భావించే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమర్థవంతంగా వ్యవహరించలేకపోతోందని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పుకోవడం కాదు.. తెలంగాణ హక్కుల కోసం ఎన్ని సార్లు బలంగా మాట్లాడారు అనేదే ముఖ్యంఅని డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఢిల్లీ పర్యటనలు, కేంద్ర పెద్దలతో భేటీలు జరుగుతున్నప్పటికీ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించే విషయంలో ఫలితం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ఫైల్‌ను తిప్పి పంపే పరిస్థితి రావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ, పరిపాలనా వైఫల్యం ఉందని ఆయన మండిపడ్డారు.తెలంగాణ రైతుల ప్రయోజనాలు, సాగునీటి అవసరాలు, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు ప్రాంత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించే వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. “ఢిల్లీకి వెళ్లడం గొప్ప కాదు.. తెలంగాణ హక్కులు సాధించి రావడమే గొప్ప. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా సాధించలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యానికి సమాధానం చెప్పాలి.” అని డాక్టర్ మెతుకు ఆనంద్ స్పష్టం చేశారు.