శ్రీ భావికి భద్రేశ్వర రథ చక్రాలకు రంగులు
March 22, 2026
Prajagalam News
తాండూరు:
పట్టణ నడిబొడ్డున కోలువుదీరిన శ్రీబావిగి భద్రేశ్వర ఆలయ జాతర ఉత్సవాలలో భాగంగా రథచక్రాలకు రంగులు వేశారు.రథచక్రాలను మొదలుకుని రథం తయారు చేసేందుకు సర్వం సిద్దంగా ఉంది.రథాన్ని విడివిడి బాగాలను తయారు చేసి రథం పూర్తి చేస్తారు. తెలంగాణ లోనే ఎక్కడ లేనివిదంగా తాండూరు లో రథం విడివిడి భాగాలు తయారు చేసి రథం పూర్తి దశలోకి తీసుకొస్తారు.వచ్చేనెల 11 శ్రీభావిగి బద్రేశ్వర బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాతర ఉత్సవాలకు మన రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించేందుకు విచ్చేస్తారు.