schedule Wednesday, September 02, 2026

అరుణాచలం ప్రత్యేక బస్సును ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్

calendar_today August 4, 2026
person Prajagalam News
అరుణాచలం ప్రత్యేక బస్సును ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో తాండూర్ నుంచి ప్రత్యేక సర్వీస్ ప్రారంభం

(తాండూర్) భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందించాలనే ఉద్దేశంతో తాండూర్ నుండి అరుణాచలం (తిరువణ్ణామలై) వెళ్లే ప్రత్యేక ఆర్టీసీ బస్సును తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక బస్సు సేవ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో అందుబాటులోకి రావడం పట్ల స్థానిక ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. ఇప్పుడు తాండూర్ నుండి అరుణాచలం వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడం ఈ ప్రాంత ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.అరుణాచలం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమని, ప్రతి నెల పౌర్ణమి గిరి ప్రదక్షిణతో పాటు కార్తీక దీపోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో వేలాది మంది భక్తులు తాండూర్, పరిసర ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్తుంటారని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రత్యేక బస్సు సర్వీస్ ప్రారంభించడం భక్తులకు ఎంతో ఊరటనిస్తుందని చెప్పారు. భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆమె కొనియాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ బస్సు సౌకర్యాన్ని తాండూర్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భక్తుల విజ్ఞప్తి మేరకు అరుణాచల్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేయడం జరిగిందని మరి కొంతమంది సభ్యులు ఏకమై వేరే చోటుకు ఎక్కడైనా ప్లాన్ చేసుకుంటే స్పెషల్ బస్సును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భక్తుల కోరిక మేరకు స్పెషల్ బస్సులను వేసేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌చార్జ్ వెంకటేశం, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ప్రత్యేక బస్సుకు కొబ్బరికాయ కొట్టి, జెండా ఊపి ప్రారంభించి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.