schedule Wednesday, September 02, 2026

దాయాదుల దాడి బాధితుడికి అండగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

calendar_today August 1, 2026
person Prajagalam News
దాయాదుల దాడి బాధితుడికి అండగా బుయ్యని  శ్రీనివాస్ రెడ్డి
  (తాండూర్) దాయాదుల దాడిలో గాయపడిన బాధితుడిని  ఆర్‌బీఓఎల్ సీఈఓ బుయ్యని  శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. యాలాల మండలం జక్కేపల్లి గ్రామంలో దాయాదుల దాడిలో తీవ్రంగా గాయపడి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబురప్ప కుమారుడు లక్ష్మణ్‌ను ఆర్‌బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యని శీనన్న పరామర్శించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి దాడికి దారితీసిన పరిస్థితులను వివరంగా తెలుసుకున్నారు. లక్ష్మణ్‌కు అవసరమైన అన్ని వైద్య సేవలు అందించి మెరుగైన చికిత్స చేయాలని ఆస్పత్రి వైద్యులను కోరారు.అనంతరం యాలాల ఎస్‌ఐ విటల్ రెడ్డితో మాట్లాడిన దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రహ్లాద్ కులకర్ణి, సత్యమూర్తి, అఖిల్ బాబా తదితరులు పాల్గొన్నారు.