schedule Wednesday, September 02, 2026

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.:-   లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్. 

calendar_today July 29, 2026
person Prajagalam News
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.:-    లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్. 
  (ప్రజాగళం, కుల్కచర్ల) వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీలో ఎస్ ఐ ఆర్ నమోదు ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత తమ ఓటును బాధ్యత గల వ్యక్తికి వేసి వినియోగించుకోవాలని జాగ్రత్తగా ఒక నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ఓటు అనేది ఒక ఆయుధమని ఆయన తెలియజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ 100% విజయవంతమైందని సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  బిఎల్ఓ దేవ్ సింగ్, పంచాయతీ కార్యదర్శి వరుణ్ కుమార్, బిఎల్ఎ గోపాల్ నాయక్, వార్డు సభ్యురాలు చంప్లి బాయి ,ఉమ్లా నాయక్, గోపాల్ నాయక్, పెంట్యా నాయక్, చత్రియ నాయక్, రాజు నాయక్ ,రాంచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..