మాతృమూర్తి కీ.శే. రుక్కమ్మ కి కన్నీటి వీడ్కోలు.
July 25, 2026
Prajagalam News
(తాండూర్ )
తల్లి చివరి యాత్రలో ముందుండి అన్ని కార్యక్రమాలను బ నిర్వహిస్తూ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆయన తమ్ముడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తల్లికి నివాళులు అర్పించి అంతిమ వీడుకోలు పలికారు. నాన్నమ్మ అంతిమయాత్రలో పాడె మోసిన పట్నం అవినాష్ రెడ్డి, పట్నం రినీష్ రెడ్డి భావోద్వేగానికి లోనై చివరి వీడ్కోలు పలికారు.రుక్కమ్మ కడసారి యాత్రలో మాజీ హోంమంత్రి పి. సభిత ఇంద్రారెడ్డి , మాజీ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి , ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ చైర్మన్లు, మాజీ డీసీసీబీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాండూర్, పెద్దేముల్, యాలాల్, బషీరాబాద్ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేలాది మంది ప్రజలు పాల్గొని రుక్కమ్మ కి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు రుక్కమ్మ సేవా భావాన్ని, కుటుంబ విలువలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు.రుక్కమ్మ అంతిమయాత్ర సందర్భంగా గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఆమెకు నివాళులర్పించారు. ఆమె చూపిన ఆప్యాయత, ప్రేమ, సేవా దృక్పథం చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. జీవితాంతం కుటుంబానికి అండగా నిలిచి, అందరి మన్ననలు పొందిన రుక్కమ్మ మరణం తీరని లోటని అభిప్రాయపడ్డారు.భౌతికంగా దూరమైనా ఆమె జ్ఞాపకాలు, ఆశీస్సులు కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.