schedule Wednesday, September 02, 2026

విద్యార్థి సుశాంత్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే

calendar_today July 20, 2026
person Prajagalam News
విద్యార్థి సుశాంత్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే
(తాండూర్) గత కొన్ని రోజుల క్రితం బషీరాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు జరుగుతుండగా విద్యార్థి సుశాంత్ పై చెట్టు కొమ్మ అకస్మాత్తుగా విరిగి తలపై పడి, తలకు గాయమై హైదరాబాద్ లోని ఆలివ్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే కోలుకున్న సుమంత్ కు రూ.1,43,200/- విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం ప్రజా ప్రభుత్వం సకాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి ఆదుకుంటుందని అన్నారు.గతంలో చికిత్స ఖర్చుల నిమిత్తం వ్యక్తిగతంగా రూ.20,000/- వేల ఆర్థిక సహాయం విద్యార్థి కుటుంబ సభ్యులకు మనోహర్ రెడ్డి అందించారు. అన్ని విధాలుగా అండగా నిలిచి, మా కుటుంబానికి సహకారం అందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి  సుశాంత్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.