మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది:- ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట బీజేపీ:- వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు,పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి
June 11, 2026
Prajagalam News
(ప్రజాగళం,వికారాబాద్)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా బీజేపీ కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మారుతీ కిరణ్ బూనేటి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పన వంటి అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా భూమి సారవంతాన్ని కాపాడటంతో పాటు రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించవచ్చని అన్నారు.
రైతుల్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచేందుకు ఈ నెల 13వ తేదీన చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయం గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులతో పాటు రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే దిశగా మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో
వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు కోకటి మాధవ రెడ్డి,
బీజేపీ సీనియర్ నాయకులు యు. రమేష్ కుమార్,శివరాజ్, పండు గౌడ్,విజయ్ భాస్కర్ రెడ్డి, బద్వేశ్వర్, వికారాబాద్ జిల్లా పట్టణ మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా కన్వీనర్ జాజుల అనిల్, చౌడాపూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్,చౌడాపూర్ మాజీ మండల అధ్యక్షులు బందయ్య,మరియు ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.