సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి:- కుస్మసముద్రం సర్పంచ్ గందె ప్రవీణ్ కుమార్
June 10, 2026
Prajagalam News
(ప్రజాగళం, కుల్కచర్ల)
గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నానని కుస్మసముద్రం సర్పంచ్ గందె ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభను డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, పలువురు అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ గ్రామసభలో ముఖ్యమైన విషయాలు గ్రామ ప్రజలకు తెలియజేస్తూ జనాభా లెక్కలకు సంబంధించి ఓటర్ లిస్టు,మార్పు నమోదు గురించి, అలాగే వర్షపాత నమోదు గురించి, రైతు రిజిస్ట్రేషన్ ల గురించి, ఉపాధి హామీ పనులు,పారిశుద్ధ్య పనులు తాగునీటి సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి,ఉప సర్పంచ్ గుడిసె పద్మమ్మ, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గజ్జి లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ కేశవులు,పులి వెంకటయ్య,చిన్న మల్కయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు