schedule Saturday, June 13, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం:-లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్(జివిఎస్)

calendar_today June 10, 2026
person Prajagalam News
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం:-లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్(జివిఎస్)
    (ప్రజాగళం, కుల్కచర్ల)   ప్రజా సమస్యల పరిష్కారం,గ్రామ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నానని లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కుల్కచర్ల మండల పరిధిలోని లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీలో బుధవారం నిర్వహించిన గ్రామ సభ సందర్భంగా ఆయన మాట్లడుతూ గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేసే సమర్థవంతమైన వేదికలని విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఏఈ మణికుమార్, ఉప సర్పంచ్ ఎల్. బుజ్జి ,పంచాయతీ కార్యదర్శి వరుణ్, మహిళా సంఘాల సిసి వెంకట నర్సింలు ,అధ్యక్షురాలు శాంతమ్మ, వార్డు సభ్యులు శివమ్మ, చెంప్లి బాయ్, నరేష్ ,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆస్మా ,కరెంట్ అధికారి లక్ష్మయ్య, తదితరులు, యువకులు పాల్గొన్నారు