schedule Thursday, May 21, 2026

క్రీడాకారులను ప్రోత్సహిస్తాం

calendar_today May 17, 2026
person Prajagalam News
క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
  ఆర్ట్ ఆఫ్ గివింగ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ కొండంపల్లి బస్వరాజ్ వికారాబాద్ జిల్లా-: ప్రతి ఒక్కరు క్రీడల పైన ఆసక్తి పెంచుకోవాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆర్ట్ ఆఫ్ గివింగ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కొండంపల్లి బస్వరాజ్ అన్నారు. శనివారం వికారాబాద్ మండల పరిధిలోని జైదు పల్లి,గోదాంగూడ గ్రామాలతో పాటు దారుర్ మండలం తరిగోపుల గ్రామంలోని క్రీడాకారులకు ఆర్ట్ ఆఫ్ గివింగ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడా సామాగ్రిని అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలుగు రాష్ట్రాలలో వైభవంగా 13వ ఆర్ట్ ఆఫ్ గివింగ్ వేడుకలు జరుగుతున్నాయని, దాంట్లో భాగంగానే గ్రామాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వాలీబాల్ కిట్లను అందించడం జరుగుతుందన్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ ఫ్రొఫెసర్ అచ్యుత సమంత సేవ కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు.