schedule Thursday, May 21, 2026

ద్యాచారం లో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు

calendar_today April 20, 2026
person Prajagalam News
ద్యాచారం లో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు
  వికారాబాద్-: వికారాబాద్ మండల పరిధిలోని ద్యాచారం గ్రామంలో సోమవారం నాడు బసవేశ్వర జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.బసవేశ్వరునికి పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ...బసవేశ్వరుడు 12వ శతాబ్దపు గొప్ప సంఘ సంస్కర్త, తత్వవేత్త,లింగాయత్ సంప్రదాయ స్థాపకుడు బసవేశ్వరుడు అని అన్నారు. బసవేశ్వరుడు కుల వ్యవస్థ, లింగ వివక్షత, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. బసవేశ్వరుడు సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై చర్చించడానికి 'అనుభవ మంటపం' అనే వేదికను ఏర్పాటు చేశారని అన్నారు.బసవేశ్వరుడు రాసిన బోధనలు 'వచనాల' రూపంలో ప్రజాభాషలో ఉంటాయని చెప్పారు.ప్రజలందరూ బసవేశ్వరుని అడుగు జాడల్లో నడుచుకోవాలని,ప్రజలు ఆధ్యాత్మిక చింతన వైపు సాగాలని చెప్పారు.కుల నిర్ములన చేసేందుకు ఆయన నిత్యము పాటు పడే వారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శేఖర్, మల్లికార్జున్,లక్ష్మయ్య,శ్రీనాద్,పాండు,నందు,రవి,అమర్ తదితరులు ఉన్నారు.