• ప్రారంభించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
(తాండూరు)
తాండూరు పట్టణ ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ ఉడుపి టిఫిన్, ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాభవన్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తాండూరు పట్టణంలో నూతనంగా శ్రీకృష్ణ ఉడుపి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన టిఫిన్లు, భోజనాలను అందించడంతో పాటు కుటుంబ సభ్యులు సౌకర్యవంతమైన వాతావరణంలో భోజనం చేసేలా ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.రెస్టారెంట్ నిర్వాహకులు వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన ఆతిథ్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు ముఖ్య అతిథులైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుర ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.