దాడులకు దిగుతున్న అజ్మత్ పాషా పై కేసు నమోదు చేయండి
November 1, 2026
Prajagalam News
దాడులకు దిగుతున్న అజ్మత్ పాషా పై కేసు నమోదు చేయండి
ఖాలీల్ పాషా మీడియా సమావేశం
- వికారాబాద్:- మా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి రౌడీ షీటర్లతో దాడులకు దిగుతూ,భయబ్రాంతులకు గురి చేస్తున్న అజ్మత్ పాషా పైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని భూ యజమాని ఖాలీల్ పాషా కోరారు.ఆదివారం ఆయన వికారాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ లోని అలంపల్లి సర్వే నంబర్ 277/8లో భూమి కొనుగోలు చేయడం జరిగిందన్నారు.దానికి అనుకోని ఉన్న సర్వే నంబర్ 277/ఏ భూమి యజమాని అయ్యిన అజ్మత్ పాషా ఎప్పుడు ఇబ్బందులకు గురి చేస్తూ మారణ ఆయుధాలతో గొడవలకు దిగుతునట్లు చెప్పారు.మా సైట్ లోకి రాకుండా,పోకుండా జేసీబీతో కాలువలు తవ్వించి రౌడీ షీటర్లను ఏర్పాటు చేసి కయ్యానికి వస్తున్నారని అన్నారు.సాజిద్,బురన్ అనే రౌడీ మూకలను తీసుకు వచ్చి సైట్ లో జరిగే పనులకు అపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడే పని చేసే మా సైట్ సూపర్ వైజర్ అయిన రాకేష్ రాథోడ్ పై దాడులకు దిగడం జరిగిందని,ఆ విషయమై గత నెల 26న వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా పిర్యాదు చేశామని ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని,పోలీసులు విచారణ చేసి కేసు నమోదు చేయాలని ,రాకేష్ రాథోడ్ కు అజ్మత్ పాషా,బురన్,సాజిద్ నుంచి ప్రాణహాని ఉందని,రక్షణ కల్పించాలని కోరారు. అక్కడ పని చేసుకుంటున్న మాకు రక్షణ కల్పించాలని ఆయన అన్నారు.