• నూతన వస్త్రధారణ వేడుకలో పాల్గొన్న శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
(తాండూర్ )
తాండూరు సీనియర్ నాయకులు రవిగౌడ్ సోదరుడు శంకర్ గౌడ్ కుటుంబంలో నిర్వహించిన శుభకార్యం సందడిగా సాగింది. శంకర్ గౌడ్ మనవళ్లు మహేష్ గౌడ్ కుమారుడు, కుమార్తె సమీక్ష గౌడ్, రిత్విన్ గౌడ్‌ల నూతన వస్త్రధారణ వేడుక ఘనంగా నిర్వహించారు. తాండూరులోని చల్లా గార్డెన్‌లో జరిగిన ఈ వేడుకకు శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్, రవిగౌడ్, సురేందర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది.