schedule Thursday, September 03, 2026

చిరు వ్యాపారుల దుకాణాల ఏర్పాటుకు కృషి... నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

calendar_today April 18, 2026
person Prajagalam News
చిరు వ్యాపారుల దుకాణాల ఏర్పాటుకు కృషి... నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూర్) పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలంలో చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునేందుకు నూతన దుకాణాల ఏర్పాటుకు కృషి చేస్తామని ఆర్ బి ఓ ఎల్ సి ఈ ఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు చిరు వ్యాపారంతో కలిసి డిపో మేనేజర్ ను కలిశారు.తాండూరు బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలంలో గల డబ్బాలు తొలగించిన నేపథ్యంలో చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకునే ఆర్టీసీ స్థలంలో వారికి నూతన దుకాణాలు నిర్మించి ఇవ్వాలని డిపో మేనేజర్ సురేష్ తో చర్చించారు.తొందరలోనే నూతన దుకాణాలు నిర్మించి వారికి కేటాయించి చిరు వ్యాపారులకు న్యాయం చేసేలా కృషి చేస్తామని అన్నారు.