schedule Thursday, September 03, 2026

పరిగి మున్సిపల్ లో కల్తీ కల్లు విక్రయాలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫిర్యాదు

calendar_today April 10, 2026
person Prajagalam News
పరిగి మున్సిపల్ లో కల్తీ కల్లు విక్రయాలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫిర్యాదు
వికారాబాద్ జిల్లా (పరిగి) :-పరిగి మున్సిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపిస్తూ శుక్రవారం ఆబ్కారీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు .ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మీదిగడ్డ శ్రీనివాస్,వారాల రవి, నరేష్ యాదవ్,ఆనెం ఆంజనేయులు మాట్లాడుతూ పరిగి పట్టణంలో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయని దీంతో వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ విక్రయాలు నిర్వహిస్తున్న వారిపై అధికారులు తక్షణమే దాడులు నిర్వహించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.