త్రాగునీటి సమస్యల నివారణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
April 6, 2026
Prajagalam News
జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ
వేసవి కాలంలో త్రాగునీటి సమస్యల నివారణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కలెక్టరేట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెం.08416-235291 కు కాల్ చేయవచ్చని, వేసవి కాలంలో త్రాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో త్రాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడినదని , ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 వరకు పై నెంబర్ సంప్రదించాలని తెలిపారు.
ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలు తమ ప్రాంతాల్లో త్రాగునీటి కొరత, పైప్‌లైన్ లీకేజీలు, ట్యాంకర్ సరఫరా లోపాలు వంటి సమస్యలను తెలియజేయవచ్చునని,అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.