క్రీడా పాఠశాలకు జిల్లాస్థాయిలో ఎంపికైన కేవిఎం విద్యార్థి నాగ ప్రణయ్ గౌడ్
April 5, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా (కుల్కచర్ల):వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ లో జిల్లా స్థాయిలో క్రీడా పాఠశాల ప్రవేశానికి నిర్వహించిన పోటీలలో కుల్కచర్ల మండల కేంద్రంలోని కరణం వెంకట్రావ్ మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో చదువుతున్న మండల కేంద్రానికి చెందిన కాంగారి బాలకృష్ణ గౌడ్ కుమారుడు కాంగారి నాగ ప్రణయ్ గౌడ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో 6వ ర్యాంక్ సాధించారు. పాఠశాల కరెస్పాండంట్ కరణం ప్రహ్లద్ రావు,ప్రిన్సిపాల్ సాయి కుమార్,అధ్యాపకులు అభినందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని, క్రీడల ద్వారా క్రీడాల కోటాలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.