schedule Thursday, September 03, 2026

గిరిజన ఆడబిడ్డల వివాహాలకు అండగా ఉంటాం పటేల్ చెరువు తండా సర్పంచ్ శాంతి తులసి రాం నాయక్

calendar_today April 2, 2026
person Prajagalam News
  1. వికారాబాద్ జిల్లా (కుల్కచర్ల)గిరిజన ఆడబిడ్డల వివాహాలకు వారి కుటుంబాలకి అండగా ఉంటామని పటేల్ చెరువు తండా సర్పంచ్ శాంతి తులసి రాం నాయక్ అన్నారు. కుల్కచర్ల మండల పరిధిలోని పటేల్ చెరువు తండా గ్రామపంచాయతీకి చెందిన విస్లావత్ పద్మాబాయి గణేష్ దంపతుల కుమార్తె అనిత( సంధ్య ) వివాహ వేడుకకు గ్రామ సర్పంచ్ అందిస్తున్న శాంతి కానుక కార్యక్రమంలో భాగంగా ఒక క్వింటాల్ సోనా బియ్యం మరియు 15 కేజీల మంచి నూనె ఫిల్టర్ వాటర్ కూల్ డబ్బాలను గురువారం వారి నివాసంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్ గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్ వార్డు సభ్యులు సురేష్ డి.రవి గోపాల్,తండా యువకులు పండు,బాలు నాయక్,దశరత్,రాము,వెంకట్,మిషన్ భగీరథ లైన్మెన్ వెంకటయ్య,మల్లేష్ తండావాసులు పాల్గొన్నారు