schedule Friday, September 04, 2026

శ్రీ సద్గురు పొట్లి మహారాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

calendar_today April 1, 2026
person Prajagalam News
శ్రీ సద్గురు పొట్లి మహారాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 
    * రాజగోపుర, దుకాణాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే   తాండూర్   ఆలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని శ్రీశ్రీశ్రీ పోటి మహారాజ్ దేవాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీశ్రీశ్రీ సద్గురు పోట్లి మహారాజ్ దేవస్థానం యొక్క రాజగోపుర నిర్మాణానికి మరియు దుకాణముల పునఃనిర్మాణ ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఆలయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. పురాతన దుకాణ సముదాయాలు పునర్నిర్మానం చేయడంలో ఆలయానికి ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని అన్నారు. బాధ్యతతో పాలకవర్గం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నరసింహులు, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, నాయకులు రవి గౌడ్, బాల్ రెడ్డి, దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్,ఈవో నరేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలయ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు, పాల్గొన్నారు.