schedule Wednesday, September 02, 2026

రైతులను మోసం చేసే అధికారులను నిలదిద్దాం

calendar_today March 29, 2026
person Prajagalam News
రైతులను మోసం చేసే అధికారులను నిలదిద్దాం
  భారతీయ కిసాన్ సంఘ్
వికారాబాద్-: వికారాబాద్ మార్కెట్ లో జరిగే అక్రమాలను నిలదీసేందుకు రైతులందరూ రేపు(సోమవారం) వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కు తరలి రావాలని భారతీయ కిసాన్ సంఘ్ వికారాబాద్ జిల్లా శాఖ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది.వికారాబాద్ మార్కెట్లో రైతులకు జరుగుతున్న అన్యాయం. రైతు మార్కెట్ కు వచ్చిన రైతు అవసరాల విషయమై వ్యవసాయ శాఖ అధికారులను నిలదీసి, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చేయి చేయి కలిపి ఉద్యమానికి పూలబాట వేద్దామన్నారు. ప్రతి గ్రామ రైతులు సోమవారం ఉదయం వికారాబాద్ మార్కెట్ కార్యాలయం వద్ద తరలిరావాలని,రైతు ఐక్యతను చాటి, ప్రభుత్వ అధికారులకు వారి బాధ్యతలు గుర్తు చేద్దామన్నారు. వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నియమాలకు విరుద్ధంగా అధికారులు దుకాణదారులు కలిసి రైతులను దోపిడీ చేస్తున్నారు.గంజిలో కమిషన్ 1.75% ఉండాలి. కానీ 4% వసూలు చేసి దోపిడీకి పాలు పడుతున్నారని అన్నారు. ముట్టి తీసుకోకూడదు. కానీ తీసుకుంటున్నారు.తూకంలో 1 కేజీ మాత్రమే తీసుకోవాలి.కానీ 100 కేజీలకు 2 కేజీలు అదనంగా తీస్తున్నారని మండిపడ్డారు. రైతుకు తత్‌పట్టి ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు – దీని వలన రైతులకు, ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు.కూరగాయల మార్కెట్లో 4% బదులు 10% కమిషన్ తీస్తున్నారు. దీనితో పాటు ముట్టి కూడా తీస్తున్నారని అన్నారు.త్రాగునీరు, బాత్రూమ్స్, రైతులు సేద తీరేందుకు సౌకర్యాలు లేవన్నారు. రైతులకు నష్టం కలిగించే అధికారుల పై తేదీ: 30-03-2026 (సోమవారం) సమయం: ఉదయం 11:00 గంటలకు, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ ముందు రైతులు అధిక సంఖ్యలో హాజరై అధికారులను నిలదీసే కార్యక్రమాన్ని రైతులు విజయవంతము చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ పిలుపునిచ్చారు.