ప్రభుత్వ నిధులతో గ్రామ అభివృద్ధి పనులు శంకుస్థాపన ఎమ్మెల్యే
October 31, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో మంతట్టి గ్రామంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గ్రామ అభివృద్ధి కోసం రూ.40 లక్షలు ప్రభుత్వ నిధులతో శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంలో బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రూ.10 లక్షలతో ఎస్సీ వాడలో సైడ్ డ్రైన్,సీసీ రోడ్డు,
రూ.10 లక్షలతో నూతన సీసీ రోడ్డు,10 లక్షలతో మహిళ సంఘం భవనం, 10లక్షలతో నైపుణ్య అభివృద్ధి కేంద్ర భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి తెల్ల రేషన్ కార్డు, మహిళలకు ఉచిత బస్సు,మండలంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఉచిత విద్యుత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి తెలిపారు. అనంతరం నూతన రేషన్ కార్డుల 546 స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి, జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి,అల్పాహారం, మధ్యాహ్న,భోజనం, విద్యా బోధన పలు విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గిరిజమ్మ ప్రభాకర్,తహశీల్దార్ షాహిద బేగం,ఎంపిడిఓ సంపత్ కుమార్,పిఎసిఎస్ చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకరప్ప,మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రజవర్ధన్ రెడ్డి,సర్పంచుల అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ మహారాజ్,వెంకట్ రామ్ రెడ్డి,మాధవ రెడ్డి,అజయ్ ప్రసాద్,రాము నాయక్, శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.