రెడ్డిఘనపూర్ గ్రామంలో 68.60 లక్షల నిధులతో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
October 31, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పరిధిలో రెడ్డిఘనపూర్ గ్రామంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గ్రామ అభివృద్ధి లక్ష్యం అంటూ రూ.68.60 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేశారు.ఈ సందర్భంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ
10 లక్షలతో సైడ్ డ్రైన్,సీసీ రోడ్డు,6 లక్షలతో సీసీ రోడ్డు,10 లక్షలతో మహిళ సంఘం భవన,13.60 లక్షలతో జడ్పిహెచ్ఎస్, ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రహరీ గోడ ,9లక్షలతో రైతులకు మట్టి రోడ్డుకు ప్రభుత్వ నిధులతో గ్రామాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. గ్రామాలు అభివృద్ధి చేస్తానని,మాట ఇస్తే మాట తప్పే ప్రభుత్వం కాదని సభలో ప్రసంగించారు. అదేవిధంగా 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన ఇందరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలారి బసంత్,తహశీల్దార్ షాహిద బేగం,ఎంపిడిఓ సంపత్ కుమార్,పిఎసిఎస్ చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకరప్ప,మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రజవర్ధన్ రెడ్డి,సర్పంచుల అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ మహారాజ్,వెంకట్ రామ్ రెడ్డి,మాధవ రెడ్డి,అజయ్ ప్రసాద్,రాము నాయక్,వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.