October 29, 2026
Prajagalam News
నిరుద్యోగ యువతకు అండగా బీఎంఆర్ ఫౌండేషన్
తాండూర్ గ్రంథాలయంలో పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
తాండూర్: వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు బీఎంఆర్ ఫౌండేషన్ ముందడుగు వేసింది. తాండూర్ పట్టణంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్‌ను అందజేశారు.అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అవసరమైన అధ్యయన సామగ్రిని అందించడం ద్వారా వారి ప్రిపరేషన్‌కు తోడ్పాటు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో చదువుకునేందుకు అవసరమైన వనరులను అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. యువతకు విద్యా పరంగా ప్రోత్సాహం అందించడంలో బీఎంఆర్ ఫౌండేషన్ చేస్తున్న ఈ ప్రయత్నం పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగకరంగా నిలవనుంది.