schedule Thursday, September 03, 2026

బీఆర్ఎస్ కార్యాలయంలో ఉగాది సంబరాలు

calendar_today March 19, 2026
person Prajagalam News
బీఆర్ఎస్ కార్యాలయంలో ఉగాది సంబరాలు
  • వికారాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా ఉగాది సంబరాలు
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మెతుకు ఆనంద్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం అందరికీ శుభాలను తీసుకురావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా ఉగాది వేడుకలను జరుపుకున్నారు.