schedule Monday, November 02, 2026

రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ

calendar_today October 17, 2026
person Prajagalam News
రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఎన్ఎంఇఓ,ఓఎస్ పథకం క్రింద మండల వ్యవసాయ అధికారి అనిత రైతు వేదిక లో శుక్రవారం నాడు వేరుశనగ విత్తనాల పంపిణీ చేశారు.ఈ పథకం ద్వారా రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తనాలను అందించి, మండలంలో వేరుశనగ సాగును ప్రోత్సహించడం, నూనెగింజల ఉత్పత్తిని పెంపొందించడం, రైతులకు వంటనూనె పంటల సాగుపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కరుణ అజయ్ ప్రసాద్, ఏఎంసి వైస్ చైర్మన్ శంకరప్ప, బషీరాబాద్ సర్పంచ్ అధ్యక్షులు వెంకటేష్ మహారాజ్,పిఎసిఎస్ సీఈవో వెంకటయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు ఐజాక్ హెరాల్డ్,నవీన్, సౌమ్య,ప్రవీణ్, తదితరులు ఉన్నారు.