schedule Monday, November 02, 2026

గ్రామ సభలో పలు సమస్యలపై చర్చ 

calendar_today October 16, 2026
person Prajagalam News
గ్రామ సభలో పలు సమస్యలపై చర్చ 
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పరిధిలో కోర్వి చెడ్ ఘని గ్రామంలో గ్రామ సర్పంచ్ వడ్డే శరణమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై వార్డు సభ్యులతో చర్చలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంలో గ్రామ సర్పంచ్ వడ్డే శరణమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ మా గ్రామనికి వచ్చే నిధులు కోర్వి చెడ్ గ్రామానికి వెళ్తున్నాయని, గ్రామ అభివృద్ధికి నిధులు సరిపోవడం లేదని అధికారులు ఈ సమస్యను వెంటనే తీర్చాలని అన్నారు. అదేవిధంగా ప్రతి వాడలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని,ప్రతి వాడలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని,మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీత,ఉప సర్పంచ్ నూర్య నాయక్,వార్డు సభ్యులు వీరేష్,కోటప్ప, భీమ్లా నాయక్,గమ్లి బాయ్,సరిత, తదితరులు ఉన్నారు.