schedule Monday, November 02, 2026

రిభూసర్వే పై అవగాహన కార్యక్రమం

calendar_today October 16, 2026
person Prajagalam News
రిభూసర్వే పై అవగాహన కార్యక్రమం
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో కుప్పన్ కోట్,కోత్లా పూర్ గ్రామాలలో పంచాయతీలో రిభూసర్వే గ్రామ సర్పంచ్ రాoశెట్టి, ఆధ్వర్యంలో తహశీల్దార్ షాహిద బేగం గ్రామస్థులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ షాహేద బేగం మాట్లాడుతూ రిభూసర్వే రైతులు సహకరించాలని, భూమి కొలతలు హెచ్చుతగ్గులున్న, భూమి హద్దులు పకడ్బందీగా కొలతలు చేసి రైతులకు చూపించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి, ప్రభుత్వ సర్వే అధికారి బడుగు విజయ జాయసి,రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.