schedule Monday, November 02, 2026

భక్తిశ్రద్ధలతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు

calendar_today October 14, 2026
person Prajagalam News
భక్తిశ్రద్ధలతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు
 

• చైర్‌పర్సన్ నీరజా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు.. భక్తులకు అన్నదానం

  (తాండూరు) పట్టణంలోని సాయిపూర్ బోనం గుడి వద్ద దుర్గామాతకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించి, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని చాటుతూ అన్నదానం నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దుర్గామాత పూజలు, అన్నదాన కార్యక్రమంతో సాయిపూర్ బోనం గుడి పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.