schedule Monday, November 02, 2026

అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటాం:-డీపీఓ జయసుధ

calendar_today October 13, 2026
person Prajagalam News
అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటాం:-డీపీఓ జయసుధ
పెన్షన్ అర్హతలపై బండవెల్కిచర్లలో క్షేత్రస్థాయి పరిశీలన..     కుల్కచర్ల ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారికి పెన్షన్ అందేలా పరిశీలన చేపట్టినట్లు డిపిఓ జయసుధ అన్నారు.మంగళవారం కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల వెరిఫికేషన్ సర్పంచ్ శ్రీనయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పెన్షన్ అర్హతపై గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరుగుతుందని, అర్హులైన వారు ఎవరూ నష్టపోకుండా పారదర్శకంగా వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్‌కు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో భాస్కర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వినయ్ తదితరులు ఉన్నారు.