schedule Monday, November 02, 2026

కుల్కచర్ల మండలంలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

calendar_today October 9, 2026
person Prajagalam News
కుల్కచర్ల మండలంలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
    కుల్కచర్ల   వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. పూల పండుగగా పేరొందిన బతుకమ్మను ప్రతి ఒక్కరూ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో పండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థుల సందడితో వేడుకలు కనులపండువగా సాగాయి.