schedule Monday, November 02, 2026

గాంధీ చౌక్‌లో మహాత్మాగాంధీకి ఘన నివాళులు

calendar_today October 2, 2026
person Prajagalam News
గాంధీ చౌక్‌లో మహాత్మాగాంధీకి ఘన నివాళులు
• గాంధీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం (తాండూరు) జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని గాంధీ చౌక్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప నర్సింలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.అనంతరం పట్లోళ్ల దీప నర్సింలు మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ అందరికీ ఆదర్శప్రాయుడని, అహింస, సత్యం, శాంతి, సామరస్య మార్గాల్లో ఆయన చూపిన బాట నేటి తరానికి సైతం స్ఫూర్తిదాయకమని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ పోషించిన కీలక పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.