schedule Monday, November 02, 2026

చిన్నారిని ఆశీర్వదించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

calendar_today September 28, 2026
person Prajagalam News
చిన్నారిని ఆశీర్వదించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
  (తాండూర్ ) మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు  మనుమడి జన్మదిన వేడుకలు ఇటీవల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ వేడుకలకు హాజరు కాలేకపోయిన ఆర్బీఓఎల్‌ సీఈఓ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి  సోమవారం పట్లోళ్ళ నర్సింలు  నివాసానికి వెళ్లారు.ఈ సందర్భంగా జన్మదినం జరుపుకున్న చిన్నారిని ఆప్యాయంగా పలకరించి, ఆశీర్వదించారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్లోళ్ళ నర్సింలు కుటుంబ సభ్యులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తమ ఇంటికి వచ్చి చిన్నారిని ఆశీర్వదించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు.