schedule Monday, November 02, 2026

మైనర్ బాలికపై అత్యాచారం కేసు నమోదు

calendar_today September 26, 2026
person Prajagalam News
మైనర్ బాలికపై అత్యాచారం కేసు నమోదు
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, కామాంధులు అడ్డుతప్పుతున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లిన ఒక యువకుడు 16 సంవత్సరాల మైనర్ బాలికను అదే ప్రాంతంలోని జీవన్గీ గ్రామానికి చెందిన కోనిగేరి వినిల్ కుమార్ ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి ఎత్తుకెళ్లిన నిందితుడు,ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు.ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు వినిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు,కేసు నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయస్థానం ముందు హాజరపరిచినా నిందితుడికి కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ కే.విఠల్ తెలిపారు.