schedule Monday, November 02, 2026

రేపు కుల్కచర్ల మండలంలో పర్యటించనున్న పరిగి ఎమ్మెల్యే డా. టి.రామ్మోహన్ రెడ్డి 

calendar_today September 24, 2026
person Prajagalam News
రేపు కుల్కచర్ల మండలంలో పర్యటించనున్న పరిగి ఎమ్మెల్యే డా. టి.రామ్మోహన్ రెడ్డి 
    *రైతు వేదిక ప్రాంగణంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ, *పిఎసిఎస్ సర్వసభ్య సమావేశం, సాల్వీడ్ లో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గోననున్న ఎమ్మెల్యే టిఆర్ఆర్     వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రానికి శుక్రవారం పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి రానున్నారని కుల్కచర్ల పిఎసిఎస్ చైర్మన్ బోలుసని భీంరెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్ తెలిపారు.గురువారం పిఎసిఎస్ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో పలు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం పిఎసిఎస్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. సమావేశం అనంతరం సాల్వీడ్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్య, ఘణాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్,లాలు,మొగులయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.