schedule Monday, November 02, 2026

ఘనంగా 5వ రోజు గణేశుని నిమజ్జనం, ముఖ్య అతిథిగా బషీరాబాద్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్

calendar_today September 19, 2026
person Prajagalam News
ఘనంగా 5వ రోజు గణేశుని నిమజ్జనం, ముఖ్య అతిథిగా బషీరాబాద్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో జయంతి కాలనీ వాసులు గణేష్ విగ్రహాన్ని పెట్టి నిత్యం పూజలు, భజనలు,ఆరతులు నైవేద్యాలు ఆ విఘ్నేశ్వరునికి సమర్పించి ఐదవ రోజు నిమర్జనం రోజున భక్తులకు కాలనీవాసులు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బషీరాబాద్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్ పాల్గొని వినాయకుని దర్శించుకున్నారు. అదేవిధంగా పూజించిన వినాయకుని లడ్డును వేలం పాటలో వారనశి రమేష్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో కడమంచి వీరేష్,శ్రీనివాస్ గౌడ్,వినోద్ రాథోడ్,ప్రకాష్ రాథోడ్,అజయ్ రాథోడ్,లడ్డూ, వనరాశి రాఘవేంద్ర,కాడమంచి పవన్,విక్రమ్ ఆదిత్య,విక్రాంత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.