schedule Monday, November 02, 2026

కుస్మసముద్రంలో సర్పంచ్ గందె. ప్రవీణ్ అధ్యక్షతన హర్ ఘర్ జల్ కార్యక్రమం

calendar_today September 18, 2026
person Prajagalam News
కుస్మసముద్రంలో సర్పంచ్ గందె. ప్రవీణ్ అధ్యక్షతన హర్ ఘర్ జల్ కార్యక్రమం
గ్రామంలో నీటి సరఫరాను కాపాడుకోవడంలో  ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉండాలని కుస్మసముద్రం సర్పంచ్ గందె. ప్రవీణ్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామ పంచాయతీలో శుక్రవారం హర్ ఘర్ జల్ కార్యక్రమంపై సర్పంచ్ గందె ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్ ఇండ్లు అన్నింటికి కనెక్షన్లు ఉన్నాయన్నారు. నూతనంగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామస్తులు నీటిని వృథా కాకుండా చూసుకోవాలని,పొదుపుగా వాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈ అభిలాష్, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ పద్మ కృష్ణయ్య, వార్డు సభ్యులు శ్రీను, సురేష్, గంగపురి, మిషన్ భగీరథ వాటర్ లైన్ మెన్లు, గ్రామస్తులు పాల్గొన్నారు