schedule Monday, November 02, 2026

పిఆర్టీయు టిఎస్ కుల్కచర్ల మండల శాఖ అధ్యక్షుడిగా శ్యామ్ సుందర్ ఎన్నిక

calendar_today September 13, 2026
person Prajagalam News
పిఆర్టీయు టిఎస్ కుల్కచర్ల మండల శాఖ అధ్యక్షుడిగా శ్యామ్ సుందర్ ఎన్నిక
    కుల్కచర్ల   పిఆర్టీయూ టిఎస్ కుల్కచర్ల మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.నూతన మండల అధ్యక్షుడిగా కె. శ్యామ్ సుందర్, ప్రధాన కార్యదర్శిగా దస్తయ్య, గౌరవ అధ్యక్షుడిగా డి. వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఉపాధ్యాయులు, పిఆర్టీయూ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు. విద్యా అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తూ, ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పిఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు