schedule Thursday, September 03, 2026

పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి,వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాం

calendar_today August 21, 2026
person Prajagalam News
పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి,వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాం
  ⇒తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్
  • Vikarabad :- తెలంగాణ ప్రభుత్వము పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తూతెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం సామాజిక విప్లవకారుడు, పేదల పెన్నిధి, పేద ప్రజలకు సామూహిక వివాహాలు నిర్వహించిన మహానుభావుడు, ఆకలితో అలమటిస్తున్న ప్రజల ఆకలి తీర్చడానికి ఊరురా పండగలను నిర్వహించిన మహానుభావుడు, దేశంలో స్వాతంత్ర పోరాటానికి సమాంతరంగా హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పనిచేసిన యోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి కార్యక్రమాన్ని అక్టోబర్ 22 మరియు వర్ధంతి కార్యక్రమాన్ని డిసెంబర్ 10న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని అదేవిధంగా ఈ ప్రభుత్వ నిర్ణయానికి కృషిచేసిన మంత్రి వాకిటి శ్రీహరి కి, బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి మరియు ముదిరాజ్ పెద్దలందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో అత్యధిక జనాభాతో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగావెనుకబడి ఉన్నటువంటి ముదిరాజులకు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని, అదేవిదంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం GO. No 15 ఇచ్చి కొంతకాలం అమలు చేసి ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఎన్నికల సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సందర్భంగా ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏకు మార్చిన జీవో నెంబర్ 15 ను అమలు చేస్తామని చెప్పిన విధంగా త్వరలోనే అమలు చేయాలని కోరారు. ముదిరాజ్ సోదరులందరూ గ్రామ గ్రామాన, మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో పండుగ సాయన్న జయంతి కార్యక్రమాన్ని మరియు వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవాలని, ప్రభుత్వ నిర్వహణలో భాగస్తులు కావాలని కోరారు.