schedule Wednesday, September 02, 2026

బ్లాక్ లో మద్యం అమ్మకాలు

calendar_today August 13, 2026
person Prajagalam News
బ్లాక్ లో మద్యం అమ్మకాలు
   ⇒కేసు నమోదు చేసిన పోలీసులు వికారాబాద్ జిల్లా కేంద్రంలో పలు కిరాణా షాపులతో పాటు ఇతర షాపులో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. వికారాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో వివిధ షాపులలో మద్యం అమ్ముతున్నారని సమాచారం మేరకు గురువారం వికారాబాద్ పోలీసులు పలు షాపులపై రైడ్ చేశారు.అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న బానొత్ సక్కుబాయి,బుర్ర రాములు, పట్లల విటల్ గౌడ్ లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పట్టుబడిన మద్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు.ఎవ్వరు కూడా కిరాణా షాపులో,ఇతర షాపులో మద్యం అమ్మరాదని,అమ్మితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.