schedule Wednesday, September 02, 2026

ఉప సర్పంచ్ ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా

calendar_today August 12, 2026
person Prajagalam News
ఉప సర్పంచ్ ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా
⇒ఉప సర్పంచ్ ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులుగా రామేశ్వర్
  • వికారాబాద్ జిల్లా:- ఉప సర్పంచ్ ల సమస్యలు పరిష్కరించేందుకు తామేప్పుడు సిద్ధంగా ఉంటామని నూతనంగా నియామకం అయిన ఉప సర్పంచ్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిలారీ రామేశ్వర్ అన్నారు. వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ సిలారి రామేశ్వర్ ని రాష్ట్ర అధ్యక్షులు ఎస్ గోపాల్ బుధవారం వికారాబాద్ లో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉప సర్పంచ్ సంఘం గౌరవ అధ్యక్షులు రామేశ్వర్ మాట్లాడుతూ... జిల్లాలో ని ఉప సర్పంచ్ ల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ గోపాల్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా వికారాబాద్ మండలం ముఖ్య సలహాదారుని గా అత్వెల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ సత్తయ్యను నియమించడం జరిగింది.