రేపు వికారాబాద్ కు విశారదన్ మహరాజ్ రాక
August 4, 2026
Prajagalam News
వికారాబాద్-:
రేపు వికారాబాద్ కు డాక్టర్ విశారదన్ మహరాజ్ వస్తున్నట్లు బీసీ,ఎస్సి,ఎస్టీ జెఏసి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.సామాజిక న్యాయం,రాజ్యాధికార సాధనకై బీసీ,ఎస్సీ,ఎస్టీ జెఏసి నిరంతరం పని చేస్తుందన్నారు.బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి చౌరస్తా వద్ద ఉన్న గుప్తా ఛాయా ఏసి బంక్వెట్ హాల్ లో మధ్యాహ్నం 2 గంటలకు బీసీ,ఎస్సి, ఎస్టి జెఏసి వికారాబాద్ జిల్లా ఆవిర్భావ సదస్సు ఉంటుందని,దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ విశారదన్ మహారాజ్ వస్తున్నట్లు తెలిపారు. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించేందుకు,వికారాబాద్ లో నెలకొని ఉన్న సమస్యలను లెవనెత్తుతారని చెప్పారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ నాయకులు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని శ్రీనివాస్ ముదిరాజ్ కోరారు.