schedule Wednesday, September 02, 2026

రేపు జరిగే విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి

calendar_today July 23, 2026
person Prajagalam News
రేపు జరిగే విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి
 

• ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు ప్రేమ్ కుమార్

(తాండూర్) ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ రేపు జరిగే విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకేజీ పైన ఢిల్లీలో జరుగుతున్న నిరసనలో భాగంగా ఢిల్లీలో విద్యార్థి యువతపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రమంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెంటనే చేయాలని, ఎన్టిఏ ను రద్దు చేయాలని, ఢిల్లీలో విద్యార్థి యువతపై జరిగిన దాడులపై పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విపక్ష నాయకులు రాహుల్ గాంధీని అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని పేపర్ లీకేజీ తో విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని గల మెత్తితే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రేపు జరిగే  నిరసన బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.