అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్.ఐ
July 14, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్.ఐ కె.విఠల్ అన్నారు.ఎస్.ఐ కె.విఠల్ నమ్మదగిన సమాచార మేరకు ఎక్మైయి గ్రామానికి చెందిన మూడు ట్రాక్టర్ లు దేవనూర్ వెంకటప్ప తండ్రి భీమప్ప ట్రాక్టర్ నెంబర్ టిఎస్ 34ఎ2337,తుప్పుడు శ్రీనివాస్ తండ్రి వెంకటయ్య ట్రాక్టర్ నెంబర్ టిఎస్34 బి3245,సందపురం నర్సిములు తండ్రి రాంచందర్ ట్రాక్టర్ నెంబర్ టిఎస్ 34ఎ 8681,ట్రాక్టర్లతో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టు కొని కేసు నమోదు చేసి చేసినట్లు ఎస్.ఐ కె.విఠల్ తెలిపారు.