అల్లాపూర్ (బి) గ్రామని సందర్శించిన ఎంపిడిఓ సంపత్ కుమార్
July 10, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో అల్లాపూర్ (బి) గ్రామని గురువారం నాడు ఎంపిడిఓ సంపత్ కుమార్,ఎ.ఈ వెంకటయ్య సందర్శించడం జరిగింది.ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ అల్లాపూర్ (బి) గ్రామంలో ప్రాథమిక పాఠశాల లో ఉదయం అల్పాహారం,
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు స్థలంమును పరిశీలన,ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై పురోగతి,అంగన్వాడీ పాఠశాలలో వసతులు పరిశీలించడం జరిగింది తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్లాపూర్ (బి) గ్రామ సర్పంచ్ జంగం వీరయ్య,ఉప సర్పంచ్ మహేష్,పంచాయతీ కార్యదర్శి విశాల్,వార్డు సభ్యులు ప్రవీణ్ కుమార్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు శివ కుమార్,రాజు గౌడ్,తదితరులు పాల్గొన్నారు.