schedule Thursday, September 03, 2026

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

calendar_today June 28, 2026
person Prajagalam News
నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు
  గొట్టిముక్కల సర్పంచ్ సుద్దగళ్ల సంగీతా లింగమయ్య   
  • వికారాబాద్-: పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పని సరి వేయించాలని గొట్టిముక్కల సర్పంచ్ సుద్దగళ్ల సంగీతా లింగమయ్య గారు అన్నారు.ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలోని పల్లె దవాఖానలో పల్స్ పోలియో కార్యక్రమాని ప్రారంభించారు.చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశం నుంచి పోలియో వ్యాధిని తరిమి కొట్టాలనే ఉదేశ్యంతో ప్రభుత్వం ప్రతి సారి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.పోలియో రహిత సమాజమే లక్ష్యమని అన్నారు.0-5 సంవత్సరాల చిన్నారులకు రెండు పోలియో చుక్కలు వేయించాలని గ్రామస్తులకు తెలియజేశారు.గ్రామస్తులంతా పల్స్ పోలియో చుక్కలు తమ తమ పిల్లలు వేయించుకునేలా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంఎం ప్రేమ్ కుమారి,ఆశ వర్కర్ లలిత,అంగన్వాడీ టీచర్ లక్ష్మీ తదితరులు ఉన్నారు.