schedule Tuesday, November 03, 2026

శ్రీ దుర్గా మాత దేవతను దర్శించుకుని, గ్రామాలలో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

calendar_today October 19, 2026
person Prajagalam News
శ్రీ దుర్గా మాత దేవతను దర్శించుకుని, గ్రామాలలో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో నీళ్లపల్లి, మైల్వార్‌,ఎక్మైయి, దామర్ చెడ్, అల్లాపూర్ (బి), బషీరాబాద్,జీవంన్గీ గ్రామాలను సందర్శించి కార్యకర్తలతో కలిసి దుర్గామాత దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని వారికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపి బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్త జగదీష్ కు కేక్ కట్ చేసి,జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.బషీరాబాద్ గ్రామంలో అనారోగ్యం తో బాధ పడుతున్న జఫీర్ నీ కలిసి మనోధైర్యాన్ని నింపి,ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి,సర్పంచులు వేణుగోపాల్ రెడ్డి,భారతి శ్రీనివాస్ రెడ్డి,జంగం వీరయ్య స్వామి,కృష్ణ కుమార్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామకృష్ణ రెడ్డి,గోపాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి,తాహేర్,సంజీవ్, హనుమంత్ రెడ్డి,వెంకట్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.