schedule Tuesday, November 03, 2026

పబ్లిక్ స్కూల్ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు

calendar_today October 14, 2026
person Prajagalam News
పబ్లిక్ స్కూల్ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనం నిర్మాణం కోరకు 11 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకరప్ప తెలిపారు.ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ,ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యతనిస్తోంది. 2026 అక్టోబర్ 9న విడుదలైన జి.ఓ.ఆర్టి.నం 188 ప్రకారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రీ-ప్రైమరీ (PP) నుండి ఇంటర్ వరకు విద్య అందించే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం హర్షం వ్యక్తం చేశారు.